చేపల వలకు చిక్కిన మొసలి

Sun,March 24, 2019 07:17 PM

crocodile trapped in fish net in bhadradri kothagudem dist

భద్రాద్రి కొత్తగూడెం: చేపల వలకు మొసలి చిక్కిన ఘటన జిల్లాలోని బూర్గంపాడు మండల కేంద్రంలోని కోళ్లచెరువులో చోటు చేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం. బూర్గంపాడు పరిధిలోని కోళ్లచెరువులో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. చేపల కోసం వల వేశారు. కొద్దిసేపటి తర్వాత వల తీయగా దానిలో మొసలి పిల్ల కనిపించింది. వెంటనే మత్స్యకారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మత్స్యకారులు అటవీశాఖ బీట్ ఆఫీసర్ అలివేలు మంగకు మొసలిని అప్పగించారు. ఇదిలా ఉండగా చెరువులో మరికొన్ని మొసళ్లు కూడా ఉన్నాయేమోనని గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

3231
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles