షికారుకొచ్చి అన్యాయమైపోయింది..!

Sun,August 25, 2019 08:44 PM

Crocodile dies on  road in suryapeta

చింతలపాలెం: పులిచింతల ప్రాజెక్టు నీటి నుంచి బయటకు వచ్చిన మొసలి..గుర్తు తెలియని వాహనం కిందపడి నలిగి చనిపోయింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల వజినేపల్లి, పులిచింతల ప్రాజెక్టు కాలనీ రోడ్డు మార్గమధ్యలో ఉన్న కొత్తవాగు బ్రిడ్జి పైన ఆదివారం చోటు చేసుకుంది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని రోజుల నుంచి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న కృష్ణా వరద ఉధృతి కారణంగా మొసళ్లు పులిచింతల ప్రాజెక్టుకు చేరుకుంటున్నాయి. దీంతో ఆదివారం రోడ్డు పైకి మొసలి రావడంతో గుర్తు తెలియని భారీ వాహనం తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన మొసలిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకోని పోస్టుమార్టం చేసి మండలంలోని చింతలపాలెం కంపార్డుమెంట్-1లో దహనం చేశారు. లారీ లేదా ట్రాక్టర్‌ కిందపడి మొసలి చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు నదిలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, పర్యాటకులు నదిలోకి దిగవద్దని హెచ్చరించారు.

భయాందోళనలో ప్రజలు..
కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటికి మొసళ్లు పులిచింతల ప్రాజెక్టుకు చేరాయని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నది పరిసర ప్రాంతాల్లో మొసళ్లు సంచరించడంతో జనాల్లో కలవరం సృష్టిస్తోంది. మొసళ్ల సంచారంపై అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

3693
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles