టీఎస్‌కాప్ మొబైల్‌యాప్‌లో నేరస్తుల సమాచారం

Thu,January 18, 2018 02:31 PM

criminals Information in TSCOP mobile app

హైదరాబాద్: టీఎస్‌కాప్ మొబైల్‌యాప్‌లో నేరస్తులకు సంబంధించిన సమస్త సమాచారం పొందుపరచనున్నట్లు రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని పాత నేరస్తులందరి సర్వేను పూర్తిచేసినట్లు తెలిపిన డీజీపీ ఈ సందర్భంగా వివరాలను వెల్లడించారు. టెక్నాలజీ సాయంతో నేరాలను పూర్తిస్థాయిలో అరికడతామన్నారు. సర్వే ద్వారా పాత నేరస్తుల వ్యక్తిగత జీవితాలను అదేవిధంగా వారి జీవనశైలి ఎలా ఉందో తెలుసుకునే అవకాశం దొరికిందని చెప్పారు. ప్రస్తుతం నేరం చేస్తున్న వారి వివరాలు సేకరించామన్నారు. నేరస్తుల అందరిపై జియోట్యాగింగ్ చేసి వారి కదలికలను గమనిస్తున్నట్లు తెలిపారు. గత నేరస్తుల చరిత్ర, ప్రస్తుత నేరస్తుల చరిత్ర అంతా టీఎస్‌కాప్ మొబైల్‌యాప్‌లో అప్‌డేట్ చేయనున్నట్లు తెలిపారు. సర్వేతో పాటు జియోట్యాగింగ్, పునరావాసం కల్పించేలా సమాంతరంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. చిన్న నేరం చేసినా దొరికిపోతాం, శిక్షపడుతుందన్న భయం నేరస్తుల్లో కలుగుతుందన్నారు. భవిష్యత్‌లో మరింత టెక్నాలజీని అనుసంధానం చేయనున్నట్లు డీజీపీ పేర్కొన్నారు.

773
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS