అమెరికా నుంచి క్రికెట్ బెట్టింగ్ దందా

Thu,June 13, 2019 08:41 AM

cricket betting from america gang arrested in hyderabad

హైదరాబాద్ : అమెరికాలో ఉంటూ తన అనుచరులతో మొబైల్ అప్లికేషన్ ఉపయోగిస్తూ క్రికెట్ బెట్టింగ్ దందా నిర్వహిస్తున్న ఓ ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమైన తరువాత హైదరాబాద్‌లో ఈ ముఠా పట్టుబడడం మొదటిది. ఈ ముఠా నుంచి రూ. 8 లక్షల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సింధికాలనీకి చెందిన బర్కత్ బెట్టింగ్ దందాలు మొదలు పెట్టాడు. పస్తుతం అమెరికాలో ఉంటూ తన గ్యాంగ్‌తో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. సికింద్రాబాద్ ప్రాంతంలో నివాసముండే ఇతని స్నేహితులు జైనిల్ రూపాని, నిజామ్ , మెహిత్, నికాహార్ మహేశ్వరి, రాహుల్ జైన్, వైభవ్ సాల్విలతో పాటు దానిష్ , సోహెల్, సాహెల్‌లను ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. మ్యాచ్ బాక్స్9.కామ్ యాప్‌తో బర్కత్ తరపున గోవా నుంచి దానిష్ సోహెల్, సాహిల్‌లు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించిన నగదును ఫంటర్ల నుంచి తీసుకొని వెళ్తుండగా రాంగోపాల్‌పేట్ ప్రాంతంలో సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ మధుమోహన్‌రెడ్డి బృందానికి పట్టుబడ్డారు. బర్కత్, గోవాలో ఉన్న వారు మినహా మిగతా ఆరు మందిని పోలీసు లు అరెస్ట్ చేశారు. వీరిని తదుపరి విచారణ నిమిత్తం రాంగోపాల్‌పేట్ పోలీసులకు అప్పగించారు.

971
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles