రోడ్డెక్కిన సీపీఐ రాజకీయం.. నడి రోడ్డుపై నాయకుల బాహాబాహి

Sat,November 17, 2018 10:40 PM

CPI candidates dispute on road in wyra of khammam dist

ఖమ్మం: మహాకూటమి పొత్తుల్లో భాగంగా వైరా సీటు దక్కించుకున్న సీపీఐ నాయకులు నడి రోడ్డుపై బాహాబాహికి దిగి నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు అన్న చందంగా వ్యవహరించిన తీరు స్థానికులను విస్మయానికి గురి చేసింది. వైరాలోని ఏసీపీ కార్యాలయం సాక్షిగా రాష్ట్రీయ ప్రధాన రహదారిపై సీపీఐ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

మహాకూటమిలో సీపీఐ సీటును పొందిన అభ్యర్థిగా బానోత్ విజయబాయ్‌ని ప్రకటించి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆమెతో జిల్లా నాయకత్వం శనివారం నామినేషన్ దాఖలు చేయించింది. అనంతరం సీపీఐ రెబల్ అభ్యర్థి బానోత్ లాల్‌సింగ్ కూడా నామినేషన్ వేసేందుకు వస్తుండగా సీపీఐ నాయకులు, రెబల్ అభ్యర్థి లాల్‌సింగ్ వర్గీయుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాట జరిగే సమయంలో సీపీఐ రెబల్ అభ్యర్థి లాల్‌సింగ్ తన వద్ద ఉన్న నామినేషన్ పత్రాలను సీపీఐ నాయకులు లాక్కుంటారేమోనని నామినేషన్ పత్రాలతో 100మీటర్ల దూరంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి పరుగెత్తుకుంటూ వెళ్లి నామినేషన్ వేశారు.

1572
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles