650 మంది కరక్కాయ బాధితులు: సీపీ సజ్జనార్

Sat,August 4, 2018 07:04 PM

CP Sajjanar press meet over Karakkaya Fraud

హైదరాబాద్: తెలుగు రాష్ర్టాల్లో సంచలనం రేపిన కరక్కాయ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు మేనేజర్ మల్లికార్జున్‌తో పాటు మరో ఐదుగురు ఈ స్కాంలో ఉన్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. నిందితుల నుంచి రూ.41లక్షలు, ల్యాప్‌టాప్, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గత అనుభముతోనే ఈ మోసం చేశారని సీపీ వివరించారు. ఫైన్ మిత్ర ద్వారా రూ.45లక్షలకు పైగా మోసం చేసినట్లు తెలిపారు. ఈ స్కాంలో మొత్తం 650 మంది కరక్కాయ బాధితులు ఉన్నారు. 81 టన్నుల కరక్కాయను మార్కెట్ నుంచి కొనుగోలు చేశారని పేర్కొన్నారు. రూ.8,17,92,000 నగదును వినియోగదారుల నుంచి నిందితులు సేకరించారు.

వ్యాపారం కంటే మోసం చేయాలనే ఉద్దేశంతోనే యాజమాన్యం ఉందని సజ్జనార్ తెలిపారు. బాధితుల్లో 80 శాతం మహిళలే ఉన్నారు. మహారాష్ట్ర, చంద్రాపూర్‌లో ఇటువంటి కంపెనీ పెట్టాలనుకుని విఫలం అయ్యారు. సులభంగా డబ్బులు వస్తాయని ఇలాంటి వ్యాపారాలను నమ్మి ప్రజలు మోసపోవద్దు. ప్రజలు చైతన్యవంతులుగా ఉండాలి. ఇలాంటి ప్రకటనలు ప్రసారం చేసే ముందు మీడియా యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలి. నిందితులు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో తిరిగారు. చివరకు రాజేంద్రనగర్‌లో నిందితులు చిక్కారని సజ్జనార్ వెల్లడించారు.

3031
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles