ఒక్క ర్యాగింగ్‌ ఘటన జరుగకుండా పనిచేస్తాం..

Wed,July 18, 2018 09:40 PM

cp Anjanikumar says about Anti ragging

హైదరాబాద్ : ఈ ఏడాది కాలంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కేవలం రెండు ర్యాగింగ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. కాలేజీలలో ర్యాగింగ్ ను పాలద్రోరాలనే ఉద్దేశంతో బషీర్‌బాగ్‌లోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఇవాళ యాంటీ ర్యాగింగ్‌ అవగాహనా కార్యాక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..వచ్చే సంవత్సరం ఒక్క ర్యాగింగ్‌ ఘటన చోటుచేసుకోకుం‍డా పనిచేస్తామని అన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కళాశాల యాజమాన్యాలు ర్యాగింగ్‌ నిర్మూలనపై, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సీపీ సూచించారు. హైదరాబాద్‌ పోలీసులు, షీ టీమ్స్‌ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ సీసీ షికా గోయల్‌, అన్ని జోన్‌ల డీసీపీలు, కాలేజీ రిజిస్ట్రార్‌లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

1370
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles