ఆ పాపను సీసీ కెమెరాల సహాయంతో గుర్తించగలిగాం : సీపీ

Thu,July 5, 2018 04:30 PM

CP Anjani kumar press meet on child kidnap case

హైదరాబాద్ : కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో అపహరణకు గురైన పాప కేసును సీసీ కెమెరాల సహాయంతో చేధించగలిగామని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిని మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భంగా సీపీ.. మీడియాతో మాట్లాడారు. ప్రధాన నిందితురాలు సైనాతో సహా ముగ్గురిని అరెస్టు చేశామని చెప్పారు. ఈ కేసును ఏసీపీ చేతన ఫాలోఅప్ చేశారని తెలిపారు. ఈ కేసులో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. కోఠి ఆస్పత్రి, ఎంజీబీఎస్‌లలో సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా.. కిడ్నాపర్ చిన్నారిని బీదర్ తీసుకెళ్లినట్లు గుర్తించాం. బస్సు కండక్టర్ తెలిపిన వివరాల ప్రకారం కిడ్నాపర్ బీదర్‌లో దిగినట్లు గుర్తించి అక్కడికి వెళ్లాం. బీదర్ పోలీసుల సహకారంతో అక్కడ ప్రతి ఇంటిని క్షుణ్ణంగా గాలించాం. దీంతో నిందితురాలు నైనా.. శిశువును అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలిపెట్టి వెళ్లిపోయింది. శిశువును అక్కడ్నుంచి.. హైదరాబాద్‌కు తీసుకువచ్చాం. చిన్నారిని వారి తల్లిదండ్రులకు అప్పగించాం. చిన్నారికి చేతన అని ఏసీపీ చేతన నామకరణం చేశారని సీపీ తెలిపారు. నగరంలోని ప్రతి వ్యాపార సంస్థ, ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీపీ సూచించారు. నేర రహిత రాష్ట్రం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

1708
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles