దంపతుల ఆత్మహత్యయత్నం: భర్త మృతి

Thu,November 23, 2017 09:59 PM

Couple suicides husband died

సారంగాపూర్ : అప్పుల బాదతో దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా వీరిలో ఒకరు మృతిచెందగా, మరోకరు తీవ్ర ఆస్వత్తకు గురైన సంఘటన రేచపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని రేచపల్లి గ్రామానికి చెందిన కలకోట జగన్ 40 వికలాగుడు, భార్య శోభలు వ్యవసాయం చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. జగన్‌కు ఉన్న ఎకరం పొలంతో పాటు, మరో ఎకరం పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. వరిపంటకు దోమతెగులు సోకడంతో పంటదిగుబడి రాదని, వ్యసాయానికి చేసిన అప్పులు ఎక్కువ కావడంతో మనస్థాపం చెందిన దంపతులిద్దరు పురుగుల మందుతాగి హత్మహాత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జగిత్యాల తరలిస్తుండగా కలకోట జగన్ మృతి చెందాడు, శోభ తీవ్ర అస్వస్థతకు గురై జగిత్యాల ఏరియ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రణధీర్ కుమార్ పేర్కోన్నారు. జగన్ మృతితో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి

1412
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles