భార్య మృతి తట్టుకోలేక.. భర్త గుండె ఆగిపోయింది..

Sat,May 25, 2019 06:40 AM

couple dies with heart attack in kandukuru

రంగారెడ్డి : భార్య మృతిని తట్టుకోలేక భర్త గుండె ఆగిపోయింది. ఈ విషాద సంఘటన కందుకూరు మండలంలో చోటుచేసుకున్నది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం, చిప్పలపల్లి గ్రామానికి చెందిన కావలి పెంటయ్య(55) భార్య బాలకిష్టమ్మ(50) బుధవారం ఉదయం గ్రామంలో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పనులకు వెళ్లింది. పనులు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే తోటి కూలీలు ఆమెను నగరంలోని ఉస్మానియా దవాఖానకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బాలకిష్టమ్మ శుక్రవారం మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. భార్య మృతిని తట్టుకోలేక పెంటయ్య దిగులు చెందుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆయన కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

4812
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles