ఎస్జీటీ పోస్టుల నియామకాలకు షెడ్యూల్ విడుదల

Mon,October 21, 2019 09:01 PM

హైదరాబాద్ : తెలుగు మీడియం ఎస్జీటీ(సెకండరీ గ్రేడ్ టీచర్) పోస్టుల నియామకాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టులకు 3,325 మందిని టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు నియామక కౌన్సెలింగ్ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ నిర్వహించనుంది.


టీఆర్టీలో ఎస్జీటీ తెలుగు మీడియంలో 3,786 పోస్టులకు 3,325 మంది అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేసింది. 117 పోస్టులకు ఎంపిక పూర్తిచేసినప్పటికీ కోర్టు వివాదం కారణంగా వాటిని ప్రకటించలేదు. ఇప్పటికే టీఆర్టీకి సంబంధించి స్కూల్‌అసిస్టెంట్లు, భాషాపండితుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్స్‌ ఇచ్చారు.

2531
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles