పీజీ మెడికల్, డెంటల్ ఖాళీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్

Tue,May 14, 2019 08:02 AM

counselling for PG medical and Dental courses

హైదరాబాద్ : కాళోజి హెల్త్ యూనివర్సిటీ పరిధిలో పీజీ మెడికల్, డెంటల్ సీట్ల భర్తీకి కన్వీనర్ కోటా కింద ఖాళీగా ఉన్న పీజీ, డిగ్రీ, డిప్లొమా సీట్ల ప్రవేశాలకు మంగళ, బుధవారాల్లో తుది విడుత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు కేఎన్‌ఆర్ యూహెచ్‌ఎస్ రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు వైద్య కళాశాలల్లో మిగిలిపోయిన సీట్లను మూవ్ ఆఫ్ రౌండ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. అభ్యర్థులు మంగళవారం ఉదయం 7 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. తుది విడుత కౌన్సెలింగ్‌లో కేటాయించిన కళాశాలల్లో అభ్యర్థి తప్పనిసరిగా చేరాలని, లేదంటే సదరు అభ్యర్థి మూడేండ్ల పాటు పీజీ ప్రవేశానికి అనర్హుడిగా నిర్ణయిస్తామని చెప్పారు.

664
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles