ఏసీబీ వలలో అవినీతి జలగలు

Wed,June 19, 2019 07:12 PM

Corruption officials in Anti Corruption Bureau trap

హైదరాబాద్‌/ నిజామాబాద్‌: హైదరాబాద్‌ జల మండలిలో, నిజామాబాద్‌ ఎక్సైజ్‌ శాఖలో అవినీతికి పాల్పడిన అధికారులపై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన జలమండలి విభాగం లైన్‌మెన్‌ శ్రీశైలం నల్లా కనెక్షన్‌ కోసం లంచం డిమాండ్‌ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు ఈ రోజు రూ.9 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శ్రీశైలం సాహెబ్‌నగర్‌ డివిజన్‌లో లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లంచం డిమాండ్‌ చేసిన ఆధారాలు లభించడంతో సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్సై శ్రవంతిలపై కేసు నమోదు చేశారు. గుపాన్‌పల్లి కల్లు సొసైటీకి వెళ్లిన ఎస్సై, సీఐలు కల్లు శాంపుళ్లు సేకరించారు. అనంతరం లంచం ఇవ్వాలని లేకుంటే కేసులు నమోదు చేస్తామని సొసైటీ సభ్యులను బెదిరించారు. దీంతో సొసైటీ సభ్యులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ రోజు విచారణ జరిపిన ఏసీబీ అధికారులు ఆరోపణలు రుజువు కావడంతో సీఐ, ఎస్సైలపై కేసులు నమోదు చేశారు.

2504
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles