కొత్తగూడెంలో పోలీసుల కార్డన్ సెర్చ్

Fri,January 12, 2018 09:57 PM

cordon search conducted in kothagudem

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా కేంద్రం కొత్తగూడెం పట్టణంలోని గంగా బిషన్ బస్తీలో కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు చేపట్టిన ఈ తనిఖీలలో సుమారుగా రెండు వందల ఇళ్లను సోదా చేయడం జరిగింది.

అడిషనల్ ఎస్పీ రవీందర్, కొత్తగూడెం డీఎస్పీ ఎస్ఎం అలీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెర్చ్ లో ఐదుగురు సీఐలు, 20మంది ఎస్సైలు, 15మంది ఏఎస్సై/హెడ్ కానిస్టేబుళ్లు, 60 మంది సబ్ డివిజన్ సిబ్బంది, 40 మంది స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బస్తీ ప్రజలతో ఎస్పీ మాట్లాడుతూ.. ఇటువంటి సోదాలు ప్రజల సంక్షేమం కోసం, అసాంఘిక శక్తులను అరికట్టడం కోసం చేయడం జరుగుతున్నదని తెలియజేశారు. బస్తీలోని ప్రజలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వవలిసిందిగా ఆయన సూచించారు. ఈ సోదాల్లో సరిగ్గా పత్రాలు లేని 15 బైకులు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించిన పత్రాలను తీసుకొచ్చి చూపించిన తరువాత వాటిని విడుదల చేయడం జరుగుతుందని డీఎస్పీ ఎస్ఎం అలీ స్పష్టం చేశారు.

1138
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles