వినియోగదారుడా మేలుకో

Thu,December 24, 2015 07:51 AM

consumer forum

హైదరాబాద్ : ప్రజలందరూ వినియోగదారులే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వస్తువును కొనుగోలు చేయక తప్పదు. మనం కొనుగోలు చేసిన వస్తువు నాణ్యతగా లేకపోతే మోసపోయామని బాధపడతాం. ఏమీ చేయలేమని ఊరుకుంటాం. కానీ కొనుగోలులో మోసపోతే ఆ వస్తువుకు చెల్లించిన ధరను తిరిగి రాబట్టుకునే వెసులు బాటు ఉంది. ప్రభుత్వం వినియోగదారులకు ఆ హక్కును క ల్పించింది. ఇందు కోసం 1986లో వియోగదారుల చట్టాన్ని తీసుకొచ్చింది. వస్తువు కొనుగోలు చేసి మోసపోతే ఫిర్యాదుచేసి నష్టాన్ని రాబట్టుకునే అవకాశం ఇచ్చింది.
మనం కొనుగోలు చేసిన వస్తువులో లోపం ఉందనో మోసపోయామనో అనిపిస్తే ముందుగా అమ్మిన వ్యాపారికి వివరించాలి. ఆయన చెప్పిన దానికి సంతృప్తి చెందకపోతే నేరుగా జిల్లా కేం ద్రంలో ఉన్న వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాలి. వస్తువు కనుగోలు చేసిన రెండేళ్ల వరకు ఎప్పుడైనా ఈ కేంద్రాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. తెల్లకాగితంపై ఫిర్యాదు రాసి ఇస్తే సరిపోతుంది. ఫోరం వారు ముందుగా ఆ వ్యాపారికి నోటీసులు పంపించి సదరు వ్యక్తిని పిలిపించి సమస్య వివరిస్తారు. ఆయన వినని పక్షంలో జిల్లా వినియోగదారుల కోర్టులో ఫోరం వారే కేసు వేస్తారు. అప్పుడు సమస్య పరిష్కరించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

ఇలా కేసు వేయవచ్చు


* వస్తువు కొనుగోలు చేసిన సందర్భంలో కచ్చితంగా నిజమైన బిల్లు తీసుకోవాలి.
* బిల్లును కచ్చితంగా ఫోరంలో సమర్పించాలి.
* బిల్లుతో పాటు పేరు చిరునామా రాయాలి.
* ఎవరిపై ఫిర్యాదు చేస్తున్నారో వారి పేరు, బిల్లు నెంబరు ఉండాలి.
* కొనుకోలు చేసిన వస్తువు, సేవల వివరాలు స్పష్టంగా ఉండాలి.
* నష్టం విలువ వివరంగా అంకెలో రాయాలి.
* మీరు కోరుకుంటున్న పరిహారం వివరాలను దరఖాస్తుపై రాసి అందజేయాలి.

చట్టం కల్పించిన హక్కులు


రక్షణ పొందే హక్కు: ప్రమాధకర వస్తువుల నుంచి, సేవల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు వినియోగదారుల రక్షణ చట్టం కల్పించిం ది. అంటే కల్తీ ఆహార పదార్థాలు, నాణ్యతలేని వ స్తువులు సేవలతో ఎదురయ్యే ప్రమాధల నుంచి ఈ హక్కు రక్షణ కల్పింస్తుంది.
సమాచారం పందే హక్కు: వినియోగదారుడు తాను కొనబోయే వస్తువు పూర్తి సమాచారాన్ని పొందబోతున్న సేవల గురించి పూర్తి సమాచారాన్ని రాబట్టుకునే హక్కు దీని ద్వారా లభిస్తుం ది. వస్తువు నాణ్యత, ప్రమాణం, స్వచ్ఛత,బరువు, ధర మొదలైన విషయాలు తెలుసుకొని అనుచిత వ్యాపార విధానాల నుంచి రక్షించుకోవచ్చు.
ఎంపిక చేసుకునే హక్కు: అనేక వస్తువుల నుంచి తనకు కావాల్సిన వస్తువును తనకు నచ్చిన ధరలో ఎంపిక చేసుకునే అవకాశం ఈ హక్కు కల్పించింది. దీని ద్వారా అందుబాటులో ఉన్న ప్పుడే ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.
వినిపించే హక్కు: తన అభ్యంతరాలను ఆసక్తిని సంబంధిత వినియోగదారుల వేదికలపై వినిపించే హక్కు వినియోగదారడు కలిగి ఉంటాడు. వినియోగదారుడి అభిప్రాయాలను సంభందిత శాఖలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
పరిహారం పొందే హక్కు: అనుచిత, అనైతిక వ్యాపార పద్ధతుల వల్ల నష్టం వాటిల్లి నప్పుడు పరిహారం పొందే హక్కు కూడా ఉంటుంది.
దీని కోసం ప్రత్యేక న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.
వినియోగ విధ్యను పొందే హక్కు: వినియోగాంశాలకు సంబంధించిన విద్యను పొందే హక్కు వినియోగదారులకు కల్పించారు. తమ హక్కులు తెలుసుకొని వాటి ద్వారా తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేయాలి.

వినియోగ దారుల న్యాయ స్థానాలు


జిల్లా ఫోరం: జిల్లా స్థాయిలో నెలకొల్పిన వ్య వస్థను జిల్లా ఫోరంగా వ్యవహరిస్తారు. రూ. 20 లక్షలకు మించని వివాదాలు జిల్లా ఫోరం పరిధిలోకి వస్తాయి. ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ముందు వినియోగదారుడే తన కేసును వా దించుకోవచ్చు. జిల్లా ఫోరం తీర్పును సవాల్ చే స్తూ రాష్ట్ర కమీషన్‌లో అప్పీలు చేసుకునే అవకా శం కూడా ఉంటుంది.
రాష్ట్ర కమిషన్: రూ. 20 లక్షలకు పైగా రూ. కోటి విలువ వరకు గల వివాదాలు రాష్ట్ర కమీషన్ పరిధిలోకి వస్తాయి. ఇది రిజధానిలో ఉంటుంది. సవరించిన చట్టం ప్రకారం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా దీన్ని నిర్వహించుకోవచ్చు. రాష్ట్ర కమిషన్ తీర్పుపై 30 రోజుల్లోగా జాతీయ కమిషన్‌కు అప్పీలు చేసుకునే అవకాశం ఉంది.
జాతీయ కమిషన్: రూ. కోటికి మించిన విలువగల అన్ని వివాదాలు జాతీయ కమీషన్ పరిధిలోకి వస్తాయి. ఇది దేశ రాజధాని డిల్లీలో ఉంటుం ది. దేశంలో ఏ ప్రాంతంలోనైనా జాతీయ కమీషన్ తన కార్యకలాపాలను నిర్వహించవచ్చు. దీని పై 30 రోజుల్లో సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకోవచ్చు.

7260
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles