ఆర్డీవోను బెదిరించిన కానిస్టేబుల్ సస్పెన్షన్

Sat,November 9, 2019 09:40 PM

కామారెడ్డి : తన భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని కామారెడ్డి ఆర్డీవో రాజేంద్రకుమార్‌ను ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడిన ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్‌రెడ్డికి తన సొంత గ్రామమైన తాడ్వాయిలో సర్వే నంబర్ 191లో 9.20 ఎకరాల భూమి ఉంది. నా భూమికి పాస్‌బుక్ ఇవ్వు. లేకపోతే తహసీల్దార్ విజయారెడ్డికి పట్టిన గతే నీకూ పడుతుంది అని మూడు రోజుల క్రితం కామారెడ్డి ఆర్డీవోను బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. శ్రీనివాస్‌రెడ్డిపై సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

1103
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles