ఎన్నికల విధులకు వచ్చి కానిస్టేబుల్ మృతి

Thu,December 6, 2018 09:28 PM

Constable died in election duty

కౌటాల : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో ఎన్నికల విధులకోసం సిద్ధమవుతుండగా కానిస్టేబుల్ రమేశ్ (40) ఫిట్స్‌తో మృతి చెందినట్లు కౌటాల ఎస్‌ఐ అంజనేయులు తెలిపారు. కౌటాల పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న రమేశ్ అనే కానిస్టేబుల్ ఉదయం స్నానం చేసేందుకు బాత్‌రూమ్‌కి వెళ్లాడు. అదే సమయంలో మూర్చ రావడంతో పడిపోయాడు. తోటి సిబ్బంది వెంటనే సిర్పూర్ (టి) ప్రభుత్వ దవఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పంచనామా అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు ఆయన తెలిపారు. అడిషనల్ ఎస్పీ గోద్రు, డీఎస్పీ సాంబయ్య, కౌటాల సీఐ మోహన్, ఏఎస్‌ఐ హన్మండ్లు, పోలీసు అసోసియేషన్ జిల్లా అద్యక్షుడు విజయ శంకర్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన మృతి పట్ల పోలీసులు సంతాపం వ్యక్తం చేశారు.

3104
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles