తెలంగాణలో కాంగ్రెస్‌ కనుమరుగు: మంత్రి ఎర్ర‌బెల్లి

Wed,March 20, 2019 12:58 PM

Congress Will Be Zero In Telangana: Errabelli

మహబూబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఇక కనుమరుగు కాబోతోందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. తొర్రూరు టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి 500 మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్క కార్యకర్తని కంటికి రెప్పలా కాపాడుకుంటా. బీజేపీ, కాంగ్రెస్‌లు కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ప్రాంతీయ పార్టీలదే హవా.. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. టీఆర్‌ఎస్‌లో చేరుతున్న వారిని రాజీనామా చేయాలనడం హాస్యాస్పదం. రాష్ర్టాభివృద్ధిని చూసే ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతున్నారు. 16 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తే.. రాష్ట్రం అభివృద్ధిలో ముందుంటుంది. రోజుకో ఎమ్మెల్యే, రోజుకో సీనియర్‌ నాయకులు పార్టీ మారుతుంటే ఢిల్లీ నాయకులు వణికిపోతున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్‌ పార్టీ నేడు వాటి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికలంటే భయం పట్టుకుందని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

1065
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles