అసెంబ్లీ రద్దుపై దాఖలైన పిటిషన్లు కొట్టివేత

Fri,October 12, 2018 03:20 PM

congress petitions on assembly dissolve were dismissed by highcourt

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరో షాక్. జేజమ్మ అరుణమ్మకు, శశాంక్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. అసెంబ్లీ రద్దు రాజ్యాంగ విరుద్ధమని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తూ.. కేబినెట్ ఆమోదం మేరకు తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని కోర్టు స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది.

తెలంగాణ రాష్ట్ర శాసనసభ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. కాంగ్రెస్ సీనియర్ లీడర్ డీకే అరుణ, శశాంక్ రెడ్డి.. శాసనసభ రద్దును సవాల్ చేస్తూ నాలుగు రోజుల క్రితం పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై కోర్టులో ఇటీవలే వాదనలు జరిగాయి. అనంతరం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అరుణ, శశాంక్ పిటిషన్లపై ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయమే ఫైనల్ అని ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. అసెంబ్లీ రద్దు చేయడానికి మెజార్టీ ప్రభుత్వానికి అన్ని హక్కులు ఉన్నాయని వాదించడంతో.. ప్రభుత్వం వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు ఇటీవలే కొట్టేసిన విషయం తెలిసిందే. ఓటర్ల తుది జాబితాను విడుదల చేసేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇవాళ ఓటర్ల జాబితా విడుదల కానుంది.

2743
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles