తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ భూస్థాపితం: మంత్రి తలసాని

Wed,March 20, 2019 07:30 PM

Congress party washed out in Telangana says minister talasani srinivas yadav

హైదరాబాద్‌: రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారు. అభివృద్ధి జరగనిదే ప్రజలు టీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపించారా? అని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను ప్రశ్నించారు. మంత్రి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతలకు పార్టీ నడపడం చేతకావడం లేదన్నారు. ఉన్న పది మంది కాంగ్రెస్‌ నేతల్లో ఒకరంటే మరొకరికి పడదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ భూస్థాపితం అయ్యిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ కూడా విమర్శిస్తోందని ఎద్దేవచేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 120 నుంచి 130 సీట్లు గెలవబోతోంది. అదేవిధంగా 22 నుంచి 23 ఎంపీ సీట్లు గెలవబోతోందని మంత్రి పేర్కొన్నారు.

1325
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles