చంద్రబాబు కుట్రలో కాంగ్రెస్ బందీ: జగదీష్ రెడ్డి

Tue,October 30, 2018 01:24 PM

సూర్యాపేట: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుట్రలో కాంగ్రెస్ పార్టీ బందీ అయిందని రాష్ర్ట మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యపేట పట్టణం, సూర్యపేట రూరల్, చివ్వేంల మండలాల టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేపటి ఎన్నికలలో పార్టీ క్యాడర్, లీడర్ అనుసరించాల్సిన వ్యూహన్నీ శ్రేణులకు నిర్దేశించారు. ఒక్క సూర్యపేట పట్టణంలోనే 90 శాతానికి పై బడి ప్రజలు టీఆర్ఎస్ పార్టీకీ ఓటు వేసేందుకు సన్నద్ధమయ్యారన్నారు. కొత్తగా నమోదైన ఓటర్లపై దృష్టి సారించడంతో పాటు పోలింగ్ శాతాన్ని పెంపొందించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. రాష్ట్ర రాజధానికి చేరుతున్న అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి పానగల్లు ఉదయ సముద్రానికి చేరుతున్న నీటిని మూసికి చేర్చి ఆ నీటితో మూసి నదిని ప్రక్షాళన చేసి సూర్యపేటకు మొట్టమొదటి సారిగా కృష్ణా జలాలను అందించిన ఘనత టీఆర్ఎస్ పార్టీది, ముఖ్యమంత్రి కేసీఆర్ దని కొనియాడారు. ఇమాంపెట్ ఉండ్రుగొండ గుట్టలో నిర్మించిన వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ తో సూర్యపేట పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించడం చారిత్రాత్మక ఘట్టామన్నారు.

భారతదేశ చరిత్రలో ఎన్నికల మ్యానిఫెస్టోను పూర్తిగా అమలుపరిచి రికార్డ్ సృష్టించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్నారు. మ్యానిఫెస్టోలో లేని అంశాలు కళ్యాణలక్ష్మి, అమ్మవడి, కేసీఆర్ కిట్, వసతి గృహంలో సన్నబియ్యం అన్నం వంటి విప్లవాత్మక పధకాలు ప్రవేశ పెట్టి అమలు పరిచామన్నారు. మొట్టమొదటి సారిగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటించిన పార్టీ టీఆర్ఎస్ అన్నారు. విద్య పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం చౌరస్తాలో నిలుచునే నిరుద్యోగ యువతకు ఇది ఆసరా అవుతుందన్న అంశాన్ని విరివిగా విద్యార్ధి యువత దృష్టికి చేరేలా పార్టీ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ద వహించాలని పేర్కొన్నారు.

1468
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles