కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల

Tue,November 13, 2018 12:07 AM

congress party first list was released for telangana 2018 election

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ 65 మందితో కూడిన మొదటి జాబితాను సోమవారం అర్ధరాత్రి విడుదల చేసింది. సోమవారం ఉదయం నుంచి అనేక మల్లగుల్లాల అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ అధికారికంగా జాబితాను ప్రకటించారు. ఇందులో ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ అవకాశం కల్పించారు. ఒక కుటుంబానికి ఒక సీటు అనే నిబంధనను పక్కనపడేస్తూ ఉత్తమ్, ఆయన భార్య పద్మావతికి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి టికెట్‌లు కేటాయించారు. అయితే.. బీసీ నేతలుగా టికెట్ ఆశించిన పొన్నాల లక్ష్మయ్య, వీ హన్మంతరావు పేర్లు జాబితాలో చోటు చేసుకోకపోవడం గమనార్హం. వీటితో పాటు సీపీఐ ప్రధానంగా డిమాండ్ చేసిన కొత్తగూడెం, మునుగోడు, ఇంటిపార్టీ కోరిన నకిరేకల్ సీట్లు కూడా జాబితాలో ఉండడం విశేషం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక్క విద్యార్థి నేతకు కూడా చోటు కల్పించలేదు. టీజేఎస్ అడిగిన రామగుండం, ఆసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్‌లకు కూడా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడం విశేషం. కూటమి పార్టీలకు కేటాయించే సీట్లు ఇంకా ఖరారు కానందున మిగిలిన సీట్లపై ఇంకా తర్జనభర్జన పడుతుతున్నారని తెలిసింది. బుధవారం మరో జాబితా విడుదలయ్యే అవకాశముందని చెప్తున్నారు. మిగిలిన స్థానాలపై హైదరాబాద్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నేతలు తెలిపారు.

1) సిర్పూర్ - పాల్వాయి హరీశ్‌బాబు
2) చెన్నూరు - బోర్లకుంట వెంకటేశ్ నేత
3) మంచిర్యాల - కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు
4) ఆసిఫాబాద్ - అత్రం సక్కు
5) ఆదిలాబాద్ - గండ్రత్ సుజాత
6) నిర్మల్ - ఎలేటి మహేశ్వర్‌రెడ్డి
7) ముథోల్ - రామారవు పటేల్
8) ఆర్మూర్ - ఆకుల లలిత
9) బోధన్ - సుదర్శన్‌రెడ్డి
10) జుక్కల్ - సౌదాగర్ గంగారాం
11) బాన్స్‌వాడా - కూసల బాలరాజు
12) కామారెడ్డి - షబ్బీర్ అలీ
13) జగిత్యాల - జీవన్‌రెడ్డి
14) రామగుండం - ఎమ్మెస్ రాజ్ ఠాకూర్
15) మంథని- దుద్దిళ్ల శ్రీధర్ బాబు
16) పెద్దపల్లి - సి. విజయరామారావు
17) కరీంనగర్ - పొన్నం ప్రభాకర్
18) చొప్పదండి - సత్యం మేడిపల్లి
19) వేములవాడ - ఆది శ్రీనివాస్
20) మానకొండూర్ - ఆరెపల్లి మోహన్
21) ఆంధోల్ - దామోదర్ రాజనరసింహ
22) నర్సాపూర్ - సునితా లక్ష్మారెడ్డి వాకిటి
23) జహీరాబాద్ - గీతారెడ్డి
24) సంగారెడ్డి - జగ్గారెడ్డి( తూర్పు జయప్రకాశ్‌రెడ్డి)
25) గజ్వెల్ - ఒంటేరు ప్రతాప్‌రెడ్డి
26) కుత్బుల్లాపూర్ - కున శ్రీశైలంగౌడ్
27) మహేశ్వరం - పి. సబితా ఇంద్రారెడ్డి
28) చేవెళ్ల - కేఎస్ రత్నం
29) పరిగి - టి. రామ్మోహన్‌రెడ్డి
30) వికారాబాద్ - గడ్డం ప్రసాద్ కుమార్
31) తాండూర్ - రోహిత్ రెడ్డి
32) ముషీరాబాద్ - అనిల్ కుమార్ యాదవ్
33) నాంపల్లి- ఫిరోజ్ ఖాన్
34) గోషామహల్ - ముఖేశ్ గౌడ్
35) చార్మినార్ - మహమ్మద్ గౌస్
36) చంద్రాయన్‌గుట్ట - ఈసా బినోబాయి
37) సికింద్రాబాద్ - సర్వే సత్యనారాయణ
38) కొడంగల్ - రేవంత్‌రెడ్డి
39) జడ్చర్ల - మల్లు రవి
40) వనపర్తి - జి చిన్నారెడ్డి
41) గద్వాల్ - డీకే అరుణ
42) అలంపూర్ - సంపత్‌కుమార్
43) నాగర్‌కర్నూల్ - నాగం జనార్ధన్‌రెడ్డి
44) అచ్చంపేట - సీహెచ్ వంశికుమార్
45) నాగార్జునసాగర్ - జానారెడ్డి
46) హుజూర్ నగర్ - ఉత్తమ్‌కుమార్ రెడ్డి
47) కోదాడ - పద్మావతిరెడ్డి
48) సూర్యపేట - దామోదర్‌రెడ్డి
49) నల్లగొండ - కోమటిరెడ్డి వెంకటరెడ్డి
50) మునుగోడు - రాజగోపాల్‌రెడ్డి కోమటిరెడ్డి
51)భువనగిరి - అనిల్‌కుమార్‌రెడ్డి
52) నకిరేకల్ - చిరుమర్తి లింగయ్య
53) ఆలేరు - బిక్షమయ్యగౌడ్
54) కల్వకూర్తి - వంశీ చంద్ రెడ్డి
55) స్టేషన్ ఘన్‌పూర్ - సింగాపూర్ ఇందిరా
56) పాలకూర్తి - జంగా రాఘవరెడ్డి
57) డోర్నకల్ - రామచంద్రు నాయక్
58) మహబూబాబాద్ - బలరాం నాయక్
59) నర్సంపేట - దొంతి మాదవరెడ్డి
60) పరకాల - కొండ సురేఖ
61) ములుగు - సీతక్క
62) పినపాక - రేగా కాంతారావు
63) మదిర - మల్లు బట్టి వక్రమార్క
64) కొత్తగూడెం - వనామ వెంకటేశ్వర రావు
65) భద్రాచలం - పోడెం వీరయ్య

8875
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles