కాంగ్రెస్‌కు మరో షాక్.. మండలిలో ప్రతిపక్ష హోదా ఔట్!

Fri,December 21, 2018 10:20 AM

congress MLCs meet with Legislative Council chairman

హైదరాబాద్: శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్సీలు నలుగురు కలిశారు. కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాల్సిందిగా కోరుతూ ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, ప్రభాకర్, ఆకుల లలిత, సంతోష్‌కుమార్‌లు మండలి ఛైర్మన్‌ను కలిసి లేఖ అందజేశారు. ప్రభాకర్‌రావు, దామోదర్‌రెడ్డి ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. సంతోశ్‌కుమార్, ఆకుల లలిత ఇద్దరూ నిన్న సాయంత్రం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ నలుగురు ఎమ్మెల్సీలు అధికార పార్టీ పక్షం చేరడంతో కాంగ్రెస్ సభ్యుల బలం కేవలం రెండుకు పడిపోయింది. షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఇరువురు ఎమ్మెల్సీలే కాంగ్రెస్‌లో మిగిలారు. వీరు పదవీకాలం కూడా మార్చిలో ముగియనుంది. దీంతో కాంగ్రెస్ మండలిలో ప్రతిపక్ష హోదాకు దూరం కానుంది. ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం నలుగురు సభ్యులు అవసరం.

4452
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles