గులాబీ పార్టీలోకి భారీగా చేరికలు

Sun,September 23, 2018 11:43 AM

congress, minority leaders joins trs

జనగామ: గులాబీ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఇతర సంఘాల వారు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరారు.

కొడకండ్ల మండలం, లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ కార్యకర్తలు, యువ కార్యకర్తలు తదితరులు మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎర్రబెల్లి మాట్లాడుతూ... దేశానికి వెన్నెముక యువతని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే యువత రాబోయే ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకొని అవినీతి లేని నాయకులకు అభివృద్ధి చేసే నాయకులకు ఓటు వేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచుప్పుల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 60 మంది కార్యకర్తలు, తదితరులు ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

1297
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles