కేంద్రంలో, రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్

Sat,May 4, 2019 04:45 PM

జనగామ: కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో ఉనికి కోల్పోయిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆ పార్టీకి ఓటేస్తే అది చెత్తబుట్ట పాలైనట్లేనన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా వావిలాల, ముత్తారం, దర్థేపల్లి గ్రామాల్లో జరిగిన టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్న, పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలం కావాలన్నా కారు గుర్తుకు ఓటేయాలన్నారు. కేడర్ లేని కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కవని పేర్కొన్నారు.

1357
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles