మధుయాష్కీ అమ్మాయిలను అక్రమంగా రవాణా చేశారు..!

Mon,February 11, 2019 05:33 PM

congress leaders sensational comments on Maduyashki

నిజామాబాద్: కోరుట్ల, మెట్‌పల్లి నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. మధుయాష్కీకి నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమైన మధుయాష్కీని వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గోనె ప్రసాద్ డిమాండ్ చేశారు. మధుయాష్కి అమెరికాకు అమ్మాయిలను అక్రమ రవాణా చేశారని ప్రసాద్ ఆరోపించారు.

అమ్మాయిల అక్రమ రవాణాపై డీజీపికి ఫిర్యాదు చేశామని కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. అమ్మాయిల అక్రమ రవాణా కేసులో యాష్కీ జైలుకెళ్లడం ఖాయం. మధుయాష్కిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోరుట్ల అసెంబ్లీ టికెట్‌ను రూ.4కోట్లకు అమ్ముకున్నాడు. అవినీతిపరుడైన మధుయాష్కి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి. కాంగ్రెస్ సర్వనాశనం కావడానికి కారణమైన మధుయాష్కీ ప్రచారానికి వస్తే అడ్డుకుంటాం. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో ఆయనకు టికెట్ ఇవ్వకూడదని కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. మధుయాష్కీ గో బ్యాక్ నినాదాలతో కాంగ్రెస్ నాయకులు హోరెత్తించారు.

4728
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles