కాంగ్రెస్‌కు నేతల మూకుమ్మడి రాజీనామా..

Wed,November 14, 2018 09:29 PM

congress leaders resigned in jangaon after announcing tickets

8వ వార్డు కౌన్సిలర్ పదవికి అనిత రాజీనామా
కోదండరాం రాకపై కాంగ్రెస్ శ్రేణుల్లో నిరసన

జనగామ: కాంగ్రెస్ రెండో జాబితాలో పొన్నాలకు చోటుదక్కక పోవడంతో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు మూకుమ్మడి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జనగామ మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ జక్కుల అనిత కౌన్సిలర్ పదవికి, పార్టీ శాశ్వత సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదేవిధంగా మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్‌ లీడర్ ఎండీ అన్వర్ సహా 13 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్‌కు గుడ్ బై చెబుతున్నట్లు స్పష్టం చేశారు.

జనగామ అసెంబ్లీ స్థానం నుంచి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం బరిలోకి దిగుతారన్న స్పష్టమైన సంకేతాలతో కాంగ్రెస్ కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమైన పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు పార్టీని వీడాలని నిర్ణయించినట్లు చెప్పారు. పొన్నాలను కాదంటే నియోజకవర్గంలోని 28 వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ క్రియాశీల సభ్యత్వాలకు శాశ్వతంగా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. పొన్నాలకు టికెట్ నిరాకరించినందుకు నిరసనగా అన్ని మండలాల్లో పార్టీ శ్రేణులు కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది. అదేవిధంగా కాంగ్రెస్ పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ మాజీద్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖలను పీసీసీ, డీసీసీల అమోదానికి పంపుతామని వారు తెలిపారు.

4873
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles