జగిత్యాలలో గులాబీ జెండా ఎగురడం ఖాయం

Thu,September 20, 2018 02:53 PM

congress leaders join in TRS presence of MP Kavitha

జగిత్యాల : హనుమాన్‌వాడలో నిజామాబాద్ ఎంపీ కవిత సమక్షంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఎంపీ కవిత. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. జగిత్యాలలో గులాబీ జెండా ఎగురడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులిచ్చినా కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అభివృద్ధి పనులు చేయడం లేదన్నారు. పేదవాళ్లు ఆత్మగౌరవంతో బతకాలని సీఎం కేసీఆర్ డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ జగిత్యాలకు 4 వేల డబుల్ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేసినప్పటికీ.. జీవన్‌రెడ్డి పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ మాటల ప్రభుత్వమైతే.. టీఆర్‌ఎస్ చేతల ప్రభుత్వం అని మండిపడ్డారు. ఉచితంగా కంటి పరీక్షలు చేయాలని గతంలో ఎవరికీ ఆలోచన రాలేదు. సీఎం కేసీఆర్ ఉచితంగా రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు చేయిస్తున్నారని కవిత తెలిపారు.

1981
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles