భారీగా టీఆర్‌ఎస్‌లోకి చేరికలు

Sun,September 1, 2019 01:50 PM

congress leaders coming in to trs party

జనగామ: రాష్ట్రవ్యాప్తంగా అతిపెద్ద పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రలో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ కౌన్సిలర్లు వెన్నెం శ్రీలత సత్య నిరంజన్ రెడ్డి, ఆలేటి లక్ష్మీ సిద్ధిరాములు, మంగం సత్యం, పన్నీరు రాధికా ప్రసాద్ తమ అనుచరులతో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మనుగడ లేదనీ, వారికి జాతీయ స్థాయిలోనే నాయకత్వం సరిగ్గా లేదన్నారు. కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో తన పూర్తి మనుగడను కోల్పోతుందనీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం లేదని ఆయన అన్నారు.

1370
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles