వాడిపోయిన రేవంత్ రెడ్డి ముఖం

Tue,December 11, 2018 12:40 PM

హైదరాబాద్ : కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖం వాడిపోయింది. తాను 30 వేల మెజార్టీతో పక్కా గెలుస్తానని చెప్పిన రేవంత్ కొడంగల్‌లో చతికిలపడిపోయాడు. ఓటమిని అంగీకరించిన రేవంత్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ ప్రజల పక్షాన బాధ్యతయుతంగా ఉండి పోరాటం చేస్తామన్నారు. ఓడిపోతే కుంగిపోవడం.. గెలిస్తే ఉప్పొంగిపోవడం కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేదన్నారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

10323
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles