గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో కాంగ్రెస్‌కు షాక్‌

Mon,September 10, 2018 05:40 PM

Congress leader bandari lakshma reddy  quits Cong, likely to join TRS

హైద‌రాబాద్: గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద‌షాక్‌. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండారి ల‌క్ష్మారెడ్డి ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేర‌నున్నారు. పార్టీ కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో సుమారు వెయ్యిమందికి పైగా బండారి ల‌క్ష్మారెడ్డి అభిమానులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని ప‌త‌నం చేయ‌డానికి స్థాపించిన తెలుగు దేశం పార్టీతో పొత్తులో భాగంగా చేతులు క‌ల‌ప‌డం దారుణమ‌ని అన్నారు. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. టీడీపీ నుంచి వీరేంద‌ర్ గౌడ్‌కు ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ కేటాయిస్తున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు తెలుప‌డంతో బండారి ల‌క్ష్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్న‌ట్లు తెలిపారు.

బండారి ల‌క్ష్మారెడ్డితోపాటు నియోజ‌వ‌క‌ర్గంలోని రెండు స‌ర్కిళ్ల అధ్య‌క్షులు, కాప్రా స‌ర్కిల్ ప్రెసిడెంట్ బీఏ రాంచంద‌ర్ గౌడ్, ఉప్ప‌ల్ స‌ర్కిల్ ప్రెసిడెంట్ మూషం శ్రీనివాస్, నాచారం డివిజ‌న్ అధ్య‌క్షులు , నాచారం డివిజ‌న్ కార్పొరేట‌ర్‌ శాంతి సాయిజెన్ శేఖ‌ర్, గ్రేట‌ర్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సాయిజెన్ శేఖ‌ర్, ప‌ది డివిజ‌న్ల అధ్య‌క్షులు, నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఇంద్ర‌య్య‌, మైనార్టీ ప్రెసిడెంట్ స‌ర్వ‌ర్, ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం యూత్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు టిల్లు యాద‌వ్, ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎన్ఎస్‌యూఐ నాయ‌కులు అభిషేక్ గౌడ్, రంగా రెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ సందీప్ రెడ్డి, తొమ్మిది డివిజ‌న్ల కంటెస్టెడ్ కార్పొరేట‌ర్లు, డివిజ‌న్ ప్రెసిడెంట్లు, అన్ని అనుబంధ సంఘాల క‌మిటీ స‌భ్యులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ల‌క్ష్మారెడ్డితో వెళ్ల‌నున్న‌ట్లు తెలిపారు.

7792
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles