ఈ కారు పుష్పక విమానం: మంత్రి జగదీష్‌ రెడ్డి

Sat,July 13, 2019 06:08 PM

congress leader Abdul Kareem joined in trs party

సూర్యాపేట: సూర్యాపేటలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బైరు వెంకన్న టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా తాజాగా సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అబ్దుల్‌ రహీం కాంగ్రెస్‌కు బై బై చెప్పి కారెక్కారు. జిల్లా కేంద్రంలోని గొల్లబజార్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి సమక్షంలో అబ్దుల్‌ రహీం గులాబీ వనంలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ కారు పుష్పక విమానం వంటిదన్నారు. ఎంతమంది చేరినా వేగంగా ముందుకు సాగుతదన్నారు. అక్షయపాత్ర లాంటి పార్టీలో అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందరికి ఆదరణ కల్పిస్తాడన్నారు. సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధి చూసి గులాబీ గూటికి బారులు తీరుతున్నారన్నారు. జాతీయ పార్టీలుగా ఫోజులు కొడుతున్న కాంగ్రెస్‌, బీజేపీలు టీఆర్‌ఎస్‌ పార్టీ ముందు దిగదుడుపేనన్నారు. సూర్యాపేట పట్టణానికి పట్టిన మూసి పీడను వదిలించింది 2014 తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీయే అని మంత్రి పేర్కొన్నారు.

887
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles