HomeLATEST NEWScongress is enemy for telangana state, says KTR

తెలంగాణకు నెం.1 శత్రువు కాంగ్రెస్ : కేటీఆర్

Published: Mon,July 17, 2017 01:38 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
హైదరాబాద్ : తెలంగాణకు నెం.1 శత్రువు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్వీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఆనాడు తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ నినాదాన్ని అణచివేయాలని కాంగ్రెస్ ప్రయత్నించిందన్నారు. ఇప్పుడేమో తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుంటుందని నిప్పులు చెరిగారు మంత్రి. తెలంగాణకు మేలు చేయాలనుకున్న ఏ నేతను కాంగ్రెస్ నెగలనీయలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ తెలంగాణను దయాదాక్షిణ్యాలతో ఇవ్వలేదు.. తెలంగాణ ఇవ్వకపోతే వీపు చింతపండు అవుతుందనే భయంతోనే కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిందన్నారు. కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

ఈ మూడేళ్ల కాలంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్వీ సైన్యంగా పని చేసిందన్నారు. ఇప్పుడు కూడా బంగారు తెలంగాణ కోసం టీఆర్‌ఎస్వీ పని చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు నాయకత్వం వహించేది విద్యార్థులే అని పేర్కొన్నారు. జ్ఞానం కోసం చదువు.. జనం కోసం నడువు అని మంత్రి పిలుపునిచ్చారు.

బంగారు తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉద్ఘాటించారు. జయశంకర్ సార్ లేని లోటు ఎవరూ తీర్చలేనిదన్నారు. ఏ అంశంలో సందేహాన్నైనా నా నివృత్తి చేసే ఎన్‌సైక్లోపీడియా జయశంకర్‌సార్ అని తెలిపారు కేటీఆర్. ఇంటింటికీ మంచి నీళ్లు ఇవ్వాలనే ఆలోచన గతంలో ఏ సీఎంకు గుర్తు రాలేదన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇంటింటికీ మంచి నీళ్లు ఇచ్చేందుకు మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టారని తెలిపారు.

ఆనాడు ఒక్క చిత్తూరు జిల్లాలో మంచినీళ్ల పథకానికి రూ. 9 వేల కోట్లు ఖర్చు అయితే తెలంగాణలో 31 జిల్లాల తాగునీటికి రూ. 43 వేల కోట్లు ఖర్చు కావా? అని ప్రశ్నించారు కేటీఆర్. ఎప్పుడొచ్చామన్నది కాదు.. సబ్జెక్ట్ ఉందా.. లేదా అన్నది ఇంపార్టెంట్ అన్నారు. కాంగ్రెస్ కు కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు, బిల్లులు తప్ప మరేం కనిపించవు అని ధ్వజమెత్తారు. మిషన్ భగీరథ అద్భుతమైన కార్యక్రమం అని నీతి ఆయోగ్ అన్ని రాష్ర్టాలకు లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు మంత్రి. మిషన్ కాకతీయను ఐక్యరాజ్యసమితి కూడా ప్రశంసించిందని తెలిపారు.
1825
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology