కాంగ్రెస్, టీడీపీ నేతలే పాలమూరు జిల్లాను నాశనం చేశారు..

Mon,October 16, 2017 05:15 PM

congress and tdp parties destroyed mahabubnagar district

హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీ నేతలే పాలమూరు జిల్లాను నాశనం చేశారని మంత్రి లక్ష్మారెడ్డి ఉద్ఘాటించారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ మంత్రులు ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి సమక్షంలో జడ్చర్ల నియోజకవర్గంలోని నవాబ్‌పేట్ మండల కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి లక్ష్మారెడ్డి... దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు.

అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. సంక్షేమంపై రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీల వల్లే మహబూబ్‌నగర్ జిల్లా వలసల జిల్లాగా మారిందన్నారు. పాలమూరు జిల్లా కోసం ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్, టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారన్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రాజెక్టులను కట్టలేదని.. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ను కట్టనివ్వట్లేదని తెలిపారు.

పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాకే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగవంతమయ్యాయన్నారు. పాలమూరు కాంగ్రెస్ నేతలకు అడవి జంతువుల మీద ఉన్న ప్రేమ వలసపోతున్న ప్రజలపై లేదన్నారు. కాంగ్రెస్ హాయంలో ఎకరా రూ.3 లక్షల విలువ ఉన్న భూమికి కేవలం రూ.70 నుంచి 80 వేలే ఇచ్చారని మంత్రి తెలియజేశారు.

1114
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles