కాంగ్రెస్, బీజేపీల డిపాజిట్ గల్లంతు ఖాయం: వినోద్

Thu,November 19, 2015 10:20 AM

Congress and BJP lost their deposit in Warangal by poll  MP Vinod Kumar

వరంగల్: బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు వినోద్ అన్నారు. వరంగల్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణపై వివక్ష చూపిస్తుందని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఇండ్లలో తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. ఆంధ్రాకు లక్షా 90వేల ఇండ్లు కేటాయించి, తెలంగాణకు కేవలం 10వేల ఇండ్లు కేటాయించడంతో కేంద్రం తీరుపై జనం మండిపడుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే టీఆర్‌ఎస్‌కే ఓటేయ్యాలని పిలుపునిచ్చారు. పత్తికి మద్దతు ధర పెంచేందుకు కేంద్రం అంగీకరించడం లేదు.
పార్లమెంట్‌లో తెలంగాణ ప్రజల పక్షాణ కొట్లాడేందుకు మరో సైనికుడు పసునూరి దయాకర్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. జానారెడ్డి గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధాంగా ఉండాలన్నారు.

1957
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles