వ్యాపార రుణాలపై నేడు సదస్సు

Thu,May 16, 2019 06:00 AM

Conference on business loans bharatiya yuva shakti trust

హైదరాబాద్ : బేగంపేట మోతీలాల్ నెహ్రూనగర్‌లోని భారతీయ యువశక్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ రోజు వ్యాపార రుణాలపై ఉచితంగా సలహాలు సూచనలు ఇవ్వనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సదస్సులో పాల్గొనే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నూతనంగా వ్యాపారం చేసే వారికి ఉచితంగా కౌన్సెలింగ్ కొనసాగుతుందన్నారు. వ్యాపారం ఎలా నిర్వహించాలి, ఏ విధంగా రుణాలు పొందాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి తదితర అంశాలపై సలహాలు ఇస్తామన్నారు. వివరాలకు 9618453891,040 27765774 నంబర్‌ల్లో సంప్రదించాలని వారు సూచించారు.

886
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles