గుంజీలు తీయించిన ఉపాధ్యాయుడిపై పీఎస్‌లో ఫిర్యాదు

Wed,September 19, 2018 08:58 PM

Complaint on teacher in Osmania University Police station

హైదరాబాద్: పాఠ్యపుస్తకం తీసుకురాలేదన్న కారణంగా ఓ విద్యార్థినితో గుంజీలు తీయించడంతో బాధిత విద్యార్థిని తండ్రి ఆ ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తండ్రి కథనం ప్రకారం.. హైదరాబాద్ తార్నాక స్ట్రీట్ నెంబర్ 9లోని కృష్ణవేణి ట్యాలెంట్ స్కూల్‌లో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని తరగతి గదికి గణిత పాఠ్యపుస్తకాన్ని తీసుకురాలేదు. దాంతో క్రమశిక్షణ పేరుతో ఆమె చేత సదరు ఉపాధ్యాయుడు వంద గుంజీలు తీయించాడు. అప్పటికే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పినా పట్టించుకోని టీచర్ గుంజీలు తీయించాడు. ఈ చర్యతో మరింత నీరసించి పోయిన విద్యార్థిని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దాంతో ఆమెకు వైద్య చికిత్సలు చేయించి, పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించగా వారు దురుసుగా ప్రవర్తించారు. బాధితురాలి తండ్రి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

2760
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS