స్క్రీనింగ్‌ టెస్ట్‌ పేరుతో వేధింపులు..బిగ్‌బాస్‌ షోపై ఫిర్యాదు

Fri,July 19, 2019 06:54 AM

complaint logded against bigboss show in hrc


హైదరాబాద్ : స్క్రీనింగ్‌ టెస్ట్‌ పేరుతో మహిళలను లైంగిక వేధింపులకు పాల్పడుతున్న రియాలిటీ షో బిగ్‌బాస్‌ను రద్దు చేయాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు గురువారం రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. కమిషన్‌లో ఫిర్యాదు అనంతరం వర్సిటీ విద్యార్థి నాయకులు డాక్టర్‌ కందుల మధు, వేల్పుకొండ వెంకట్‌, రామక్రిష్ణ, మహేందర్‌లు మాట్లాడుతూ..కొద్ది రోజుల్లో మాటీవిలో ప్రసారం కానున్న రియాలిటీ బిగ్‌బాస్‌ షో కార్యక్రమం నిమిత్తం సభ్యుల ఎంపిక కోసం మహిళలను స్క్రీనింగ్‌ టెస్ట్‌ల పేరిట లైంగికంగా వేధిస్తున్నారన్నారు.

3 నెలల పాటు సభ్యులను పూర్తిగా నిర్భంధంలోకి తీసుకొని రహస్యంగా చిత్రీకరించడంతో పాటు షోలో పాల్గొనే సభ్యులతో బాండ్‌ పేపర్‌, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకొని మహిళలను లైంగికంగా వేధించేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంపై పూర్థి స్థాయిలో విచారణ జరిపించి, వేధింపులకు పాల్పడుతున్న షోను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

909
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles