ఎన్నికల ఉల్లంఘనలపై 1950కి ఫిర్యాదు చేయండి..

Thu,April 25, 2019 06:52 AM

Complaint against election violations

హైదరాబాద్ : మే నెల 6వ తేదీన పోలింగ్ జరుగనున్న గ్రామాల్లో ఏదేని పార్టీల అభ్యర్థులు గాని, వారి అనుచరులుగాని ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడితే, డబ్బులు పంచుతుంటే టోల్ ఫ్రీ నంబర్‌కు 1950 కు ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచించారు. గ్రామాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయని, ఓటర్ కార్డు స్థితితో పాటు పోలింగ్ కేంద్రాల వివరాలు, కోడ్ ఉల్లంఘనలపై 1950 నంబర్‌తో పాటు 040-29700826, election helplinemedchal@gmail. comకు మెయిల్ ద్వారా, ట్విట్టర్‌లో electionhelpline medchalలో తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఉదయం 9గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇవి పనిచేస్తాయని తెలిపారు. అలాగే ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, సందేహాల కొరకు మండల పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. కీసర- 9490942633, శామీర్‌పేట్-9985432683, మూడుచింతలపల్లి-8500662477, మేడ్చల్ -7569532789, ఘట్‌కేసర్-08415 222358 నంబర్లకు ఫోన్‌ద్వారా సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

మే 6వ తేదీన స్థానిక సెలవు
ఎన్నికల నేపథ్యంలో మే 6వ తేదీన సెలవును ప్రకటిస్తూ కలెక్టర్ ప్రొసీడింగ్ జారీ చేశారు. ఈ సెలవుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న మండలాల పరిధిలోని గ్రామాల్లో ఈ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు.

719
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles