సామాన్యుడి సంక్షేమానికి పెద్దపీట : పువ్వాడ

Sat,February 23, 2019 11:58 AM

common man's welfare is main place in Telangana budget says puvvada ajay kumar

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సామాన్యుడి సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శాసనసభలో పువ్వాడ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం బాగుపడింది. వ్యవసాయం బాగుంది. ఏప్రిల్ చివరి కల్లా ఇంటింటికీ మిషన్ భగరథ నీళ్లు అందుతాయి. టీఎస్‌ఐపాస్ ద్వారా ఐటీ రంగంలో మెరుగైన ప్రగతిని సాధించుకున్నం. హైదరాబాద్‌ను దేశంలోనే సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దినం. పేదల సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ. 40 వేల కోట్లు కేటాయింపు. వృద్ధాప్య పెన్షన్ అర్హత 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు. ఒంటరి హహిళలు, దివ్యాంగుల, వితంతువుల పెన్షన్లు రెట్టింపు. రైతులకు ఏడాదికి రూ. 8 వేల పంట పెట్టుబడి ఇస్తున్నం. అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది.
తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నరు. సీఎం అద్భుత పాలనతో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచారు. కుల, మతాలతో సంబంధం లేకుండా డబుల్‌బెడ్ రూం ఇండ్లు ఇస్తున్నం. రైతుల అభివృద్ధి కోసం రూ. 50 వేల కోట్లకు పైగా కేటాయించడం గొప్ప విషయం. రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు లేవు. వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. తెలంగాణ ఏర్పడితే కరెంట్ ఉండదని సమైక్య పాలకులు భయపెట్టారు. సీఎం కేసీఆర్ కృషితో 24 గంటల నిరంతర నాణ్యమైన కరెంట్ అందివ్వగలుగుతున్నం. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామిని నెరవేర్చినట్లు ఆయన పేర్కొన్నారు.

526
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles