సెల్ఫీ తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం

Mon,July 17, 2017 06:36 AM

మెహిదీపట్నం : జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు తన బాధలను చెబుతూ సెల్ఫీ వీడియో తీసుకుని గుర్తు తెలియని విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.....మల్లేపల్లి గ్లోరి థియేటర్ ఎదరుగా ఉన్న వీధిలో జహీర్ మధాని(22) అనే యువకుడు నివసిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఇతను పలు ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఈ క్రమం లో శనివారం ఆర్ధరాత్రి ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత తన జీవితాన్ని కుటుం బం కోసం త్యాగం చేస్తున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఫేస్‌బుక్‌లో లైవ్‌లో చెప్పాడు. అనంతరం ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని విషం తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. ఫేస్‌బుక్‌లో చూసిన అతడి స్నేహితులు కుటంబసభ్యులకు సమాచారం చేరవేయడంతో వారు సకాలంలో స్పందించి దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నట్లుగా పోలీసులు తెలిపారు.

660

More News