అడ్మిషన్లులేని కాలేజీల అఫిలియేషన్లు రద్దు

Sun,July 21, 2019 07:49 AM

Colleges affiliations Cancelled which is no admissions

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో జీరో ప్రవేశాలు పొందిన కాలేజీలు, కోర్సులకు ఈ ఏడాది అఫిలియేషన్లు రద్దుచేయాలని దోస్త్-2019 కమిటీ నిర్ణయించింది. అడ్మిషన్లు లేని కాలేజీలు, కోర్సుల వివరాలను శనివారం నాటికే యూనివర్సిటీ రిజిస్ట్రార్లకు అందజేయాలని ప్రైవేట్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాలను ఆదేశించింది. కేవలం 15లోపు అడ్మిషన్లు మాత్రమే పొందిన ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాటిని స్వయంగా మూసుకోవాలని దోస్త్ కమిటీ కన్వీనర్ స్పష్టంచేశారు. ఇలాంటి కాలేజీల్లో చేరిన విద్యార్థులకు తిరిగి దోస్త్ ప్రత్యేక వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఆప్షన్లు ఎంపికచేసుకోవడానికి అవకాశం కల్పించారు. దీనివల్ల ఆయా విద్యార్థులకు మిగిలిన కాలేజీల్లో సీట్లు పొందే అవకాశం ఉంటుంది. డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహిస్తున్న దోస్త్ ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల 22 వరకు, వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఆప్షన్లు ఎంపిక చేసుకోవడానికి 23వ తేదీ వరకు గడువు ఉన్నదని వెల్లడించారు. ఈ నెల 26న సీట్ల కేటాయిస్తామన్నారు. సీట్లు పొందినవారు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్, డైరెక్ట్ రిపోర్టింగ్ చేయడానికి ఈ నెల 28, 29 తేదీల్లో ప్రత్యేక ఏర్పాట్లుచేయాలని దోస్త్ కమిటీ అధికారులు కాలేజీ యాజమాన్యాలను ఆదేశించారు.

401
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles