చంపేస్తున్న చలి.. రేపట్నుంచి మరింత తీవ్రం

Tue,December 18, 2018 04:33 PM

cold winds in Telangana State

హైదరాబాద్ : ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావం వల్ల రాష్ట్రంలో పగటి పూట చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి తోడు పెథాయ్ తుపాను ప్రభావం కూడా తెలంగాణ రాష్ట్రంపై పడిందన్నారు. ఈ క్రమంలో పగటి పూట ఉష్ణోగ్రతలు ఎక్కువ స్థాయిలో పడిపోయి చలి తీవ్రత అధికమైందన్నారు. పెథాయ్ తుపాను వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గడిచిన రెండు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయని తెలిపారు.

దీంతో సాధారణం కన్నా 8 నుంచి 9 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. సాధారణంగా ఈ సమయంలో పగటి పూట 28 నుంచి 29 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదు కావాలి. కానీ 21 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదు అయ్యాయని చెప్పారు. ఇక రేపట్నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకొని.. చలి తీవ్రత తగ్గుతుందన్నారు.

కానీ ఉత్తర దిక్కు నుంచి వచ్చే గాలుల వల్ల రాత్రి సమయంలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు. డిసెంబర్, జనవరి నెలలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పెథాయ్ తుపాను అల్పపీడనంగా ఏర్పడి బలహీన పడిందన్నారు. దీని ప్రభావం తెలంగాణపై ఉండదు కానీ.. ఒడిశా, వాయువ్య బంగాళాఖాతంపై ఉంటుందన్నారు. దక్షిణ ఛత్తీస్ గఢ్ మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఒడిశా నుంచి రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి కూడా ఉందన్నారు.

4871
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles