తగ్గుముఖం పట్టిన చలి ప్రభావం

Sun,January 13, 2019 01:43 AM

Cold wave declining in telangana state

హైదరాబాద్ : రాష్ట్రంలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు కొంతమేర పెరిగాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగడంతో చలి తగ్గుముఖం పట్టింది. ఉత్తర కర్ణాటకనుంచి ఆగ్నేయ రాజస్థాన్‌వరకు మధ్య మహారాష్ట్ర, నైరుతి మధ్యప్రదేశ్ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. ప్రస్తుతం తూర్పు, ఆగ్నేయ దిశలనుంచి తెలంగాణవైపు గాలులు వీస్తున్నా యి. రాగల మూడురోజులవరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం పూట పొగమంచు ఆవరించి ఉంటుందని వివరించారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 నుంచి 17.5 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. కనిష్ఠంగా వరంగల్ రూరల్ జిల్లాలో 11 డిగ్రీలుగా నమోదవగా, గ్రేటర్ హైదరాబాద్‌లో 17.5గా నమోదైంది.

774
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles