కేంద్రంలో ఏర్పడబోయేది సంకీర్ణ ప్రభుత్వమే..

Mon,April 29, 2019 03:36 PM

coalition government will come in Centre says EX Mp vinod


రాజన్న సిరిసిల్ల: కేంద్రంలో ఏర్పడబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ..పార్లమెంట్ ఎన్నికలలో టిఆర్ఎస్ 16 స్థానాల్లో గెలవబోతున్నదని, కేంద్రంలో సీఎం కేసీఆర్ చక్రం తిప్పుతారని ధీమావ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ విలువలు దిగజార్చాయని ఆరోపించారు. పలు నియోజకవర్గాల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ నేతలు బీజేపీకి ఓటు వేయాలని ప్రచారం చేశారన్నారు. గల్లీ నుండి డిల్లీ వరకు టిఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రజలు కోరుతున్నారు. రేపు జరగబోయే పరిషత్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ బలపరచిన నేతలను భారీ మెజారిటీతో గెలిపించాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.

1181
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles