దేవాదుల ఇన్‌టేక్‌వెల్ పనులను పరిశీలించిన స్మితా సబర్వాల్‌

Tue,February 12, 2019 01:13 PM

CMO Secretary smita sabharwal visit devadula project works

ములుగు : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించడానికి ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి, నీటి పారుదల శాఖ బాధ్యులు స్మితా సబర్వాల్ ఈ రోజు ములుగు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. గోదావరి నదిపై నిర్మిస్తున్న దేవాదుల ఇన్‌టేక్‌వెల్ ప్రధాన బ్యారేజీ పనులతోపాటు పాకాల రంగాయి చెరువు ప్రాజెక్ట్ పంప్ హౌజ్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ములుగు సమీపంలోని రంగారావుపల్లి వద్ద నిర్మిస్తున్న దేవాదుల పంప్‌హౌజ్ ప్యాకేజ్-5, రామప్ప, పాకాల ప్యాకేజీ పనులను ఆమె పరిశీలించారు. ఉదయం 11:30గంటలకు ములుగు చేరుకొని 12:45 వరకు పంప్‌హౌజ్ పనులను పరిశీలించారు. అనంతరం రోడ్డు మార్గంలో వెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామానికి చేరుకొని ప్యాకేజీ రెండో పైప్‌లైన్ పనులను పరిశీలించారు.

మధ్యాహ్నం 2:45 నుంచి 4:30 వరకు రామప్ప నుంచి ములుగు గణపురం కెనాల్ ప్యాకేజీ-3 టన్నెల్ పనులను పరిశీలిస్తారు. 4:30 నుంచి 5 గంటల వరకు కేశవాపురంలోని గ్రావిటీ కెనాల్ పనులను పరిశీలిస్తారు. అక్కడి నుంచి ములుగుకు చేరుకొని హెలీకాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు. ఇంజినీరింగ్ విభాగం అధికారులు స్మితా సబర్వాల్‌కు ఆయా ప్రాజెక్టుల పనుల పురోగతిపై పూర్తి సమాచారం అందింస్తున్నారు. ప్రధానంగా ఇంజినీరింగ్ విభాగం చీఫ్ ఇంజినీర్ బంగారయ్య దేవాదుల ఇన్‌టేక్‌వెల్ పనుల పురోగతి, చేపడుతున్న విధి విధానాలను ఆమెకు వివరిస్తున్నారు. పర్యటనలో దేవాదుల ప్రాజెక్టుకు సంబంధిం చిన ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

831
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles