ఫెడరల్ ఫ్రంట్ రావాలని కోరుతున్నా: సీఎం కేసీఆర్

Tue,March 19, 2019 07:34 PM

CMKCR Wants to form Federal front in INDIA


నిజామాబాద్ : దేశంలో కాంగ్రెస్, బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ రావాలని కోరుతున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఏం జరుగుతుందో చెప్పా..ఏం జరగాలో చెప్పా. దీంతో కొందరి పీఠాలు కదిలిపోతున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన రెండో బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా ధనిక జిల్లాగా పేరుగాంచింది. సమైక్యపాలకుల పుణ్యమని నిజాంసాగర్ ఎండిపోయేది. 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సమయంలో..నిజామాబాద్ జిల్లా పరిషత్ పీఠంపై గులాబీ జెండా ఎగిరిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం గౌరవాన్ని నిలబెట్టిన జిల్లా నిజామాబాద్ అన్నారు. 15 ఏళ్ల పోరాటం తర్వాత రాష్ట్రం సిద్ధించింది. కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకున్నాం. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవాలి.

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పెన్షన్లు బాగా పెంచుకున్నాం. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. ఉమ్మడి పాలనలో వేలాదిమంది నిజామాబాద్ బిడ్డలు గల్ఫ్ దేశాలకు వలసపోయారు. ఎర్రజొన్న రైతులు ధర రావడం లేదని బాధపడుతున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం మిగిల్చిన ఎర్రజొన్న బకాయిలను టీఆర్ఎస్సే తీర్చింది. మంది మాటలు పట్టుకుని ఎర్రజొన్న రైతులు ఆగం కావొద్దు. మీతో ధర్నాలు చేయించిన మనుషులు తర్వాత మీతో ఉండరని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. ఎర్రజొన్న రైతుల లబ్ధి కోసం కృషి చేస్తానని హామీనిచ్చారు. అటవీ భూముల సమస్యను పరిష్కరిస్తాం. సంచార జాతులకు సరైన న్యాయం జరగట్లేదు. బ్యాంకుతో సంబంధం లేకుండా రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. సంచార జాతులకు రూ.1000 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు. .

దేశంలోని 16 రాష్ట్రాల్లో 52.32 లక్షల మంది బీడీ కార్మికులున్నారు. తెలంగాణలో 4.5లక్షల మంది బీడీ కార్మికులున్నారు. బీడీ కార్మికుల బాధలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. బీడీ కార్మికులకు ఏ ఒక్క రాష్ట్రం కూడా పింఛను ఇవ్వట్లేదు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా పింఛను ఇవ్వడం లేదు. బీడీ కార్మికులకు పింఛను రూ.2వేలకు పెంచి బడ్జెట్ లో పెట్టాం. ఎన్ని ఉద్యమాలు జరుగుతున్నా కాంగ్రెస్, బీజేపీ నాయకులు నాటకాలు ఆడుతారే తప్ప పనులు జరుగవని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నేను తప్పు మాట్లాడినట్లు సామాజిక మాధ్యమాల్లో దుష్ఫ్రచారం చేస్తున్నారు. ఉన్న వాస్తవాలు మాట్లాడటం తప్పా..? అని కేసీఆర్ ప్రశ్నించారు.

2053
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles