సుందిళ్ల బ్యారేజీని పరిశీలించిన సీఎం కేసీఆర్Thu,December 7, 2017 05:16 PM
సుందిళ్ల బ్యారేజీని పరిశీలించిన సీఎం కేసీఆర్


జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలనలో భాగంగా సీఎం కేసీఆర్ సుందిళ్ల బ్యారేజీని సందర్శించి, నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన సుందిళ్ల బ్యారేజీ మ్యాప్ ను పరిశీలిస్తూ అధికారులు, వర్క్ ఏజెన్సీలకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం గోలివాడలో నిర్మిస్తున్న పంపుహౌజ్ పనులను సీఎం పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఎంపీలు వినోద్ కుమార్, బాల్క సుమన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి సింగ్, డీజీపీ మహేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి, నీటి పారుదల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

714
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS