మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించిన సీఎం కేసీఆర్

Thu,December 7, 2017 12:12 PM

cmkcr Visits Medigadda project works Today


జయశంకర్ భూపాలపల్లి: జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్ పనులను పరిశీలించారు. సీఎం కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం అక్కడి నుంచి నేరుగా కన్నెపల్లి పంప్ హౌజ్ వద్దకు చేరుకుని పనులను పరిశీలించారు. అనంతరం అన్నారం బ్యారేజీ వద్ద రెండో ఆనకట్ట పనులను పరిశీలించారు. సీఎం వెంట మంత్రులు హరీశ్‌రావు, ఈటలరాజేందర్, చీఫ్‌ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీలు వినోద్, బాల్కసుమన్, డీజీపీ మహేందర్‌రెడ్డి ఇతర అధికారులున్నారు.
cm-mdg

సాగునీటి ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయడమే లక్ష్యం: సీఎం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సాగునీరు అందించడానికి తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయడమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఇవాళ సీఎం కేసీఆర్ తుపాకుల గూడెం బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్, అన్నారం బ్యారేజ్, సిరిపురం పంప్ హౌజ్ లను సందర్శించారు. ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరును అధికారులను, వర్క్ ఏజెన్సీ లను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీలు, పంప్ హౌజ్ లు, కాలువల నిర్మాణం, ఏక కాలంలో మూడు షిప్టుల్లో పనులు జరగాలని అధికారులను, వర్క్ ఏజెన్సీ లను సీఎం ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సందర్శించి పనులను సీఎం పరిశీలించారు.
harish-cmmd
ప్రాజెక్టుల నిర్మాణానికి ఎలాంటి సహకారాన్నైనా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తుపాకుల గూడెం వద్ద గోదావరి వరద ప్రవాహం గురించి అధికారులను అడగగా..ప్రస్తుతం 6 వేల క్యూ సెక్కుల వరద ప్రవాహం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. 1132 మీటర్ల కాపర్ డ్యాం నిర్మాణం దాదాపుగా పూర్తి కావొచ్చిందని అధికారులు సీఎంకు తెలియజేశారు. మరో 150 మీటర్లు పూర్తయితే మొత్తం కాపర్ డ్యాం నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు.

పక్క రాష్ట్రాల అధికారులతో పోలీస్ శాఖకు సంబంధించి ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడాలని డీజీపీ మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ సూచించారు. డ్రోన్ కెమెరాలతో కూడా ప్రాజెక్టుల పనులను పర్యవేక్షిస్తూ భద్రత పరంగా చర్యలు తీసుకుంటున్నట్టు ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ కు వివరించారు. ప్రాజెక్టులకు అవసరమైన రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రాజెక్టులు పూర్తి చేయడమే చాలా ముఖ్యమైన కార్యక్రమమని, ఈ విషయాన్ని అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలు గమనంలో ఉంచుకోవాలని సీఎం సూచించారు. సీఎం వెంట మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఎంపీలు పి. వినోద్ కుమార్, బాల్క సుమన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి సింగ్, డీజీపీ మహేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి, నీటి పారుదల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
annaram-cm

3587
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles