నూతన పంచాయతీరాజ్ చట్టం అమలుపై సీఎం కేసీఆర్ సమీక్ష

Mon,June 10, 2019 08:13 PM

cmkcr review on new panchayatiraj act

హైదరాబాద్ : రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు తెస్తున్న నూతన పంచాయతీరాజ్ చట్టం అమలు కోసం కార్యాచరణ, నూతన మున్సిపాలిటీ చట్టం రూపకల్పనపై మంత్రులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..గ్రామాలు, పట్టణాల గుణాత్మక అభివృద్ధిలో పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల పటిష్ణ అమలు కీలకమన్నారు.

ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం చట్టాలను సవరించి..మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా గ్రామాల్లో మున్సిపాలిటీ స్థాయిలో సుపరిపాలన అందించగలుగుతామని సీఎం కేసీఆర్ చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టంగా అమలు చేసిన పద్దతిలోనే మున్సిపల్ చట్టం రూపకల్పన చేయాలి. అవినీతి రహితంగా, ప్రజలకు మేలు జరిగే విధంగా చట్టం రూపొందించాలని అధికారులకు నిర్దేశించారు. నూతన పంచాయతీ రాజ్ చట్టానికి పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలి. మనసు పెట్టి పనిచేస్తే గ్రామాలు, మున్సిపాలిటీల స్థాయిలో కావాల్సినంత పని ఉన్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు.

గ్రామాలు, మౌలికరంగాల అభివృద్ధి బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను మరింత మెరుగుపరచాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. పురపాలక చట్టంలో అధికారులు, ప్రజాప్రతినిధుల్నీ బాధ్యుల్ని చేయాలని నిర్దేశించారు. సుపరిపాలన చట్టాలను సవరిస్తూ మరింత పటిష్ఠంగా అమలు చేయాలన్నారు.

ఈ సమీక్షకు మంత్రులు ఎర్రబెల్లిదయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్్ , శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు హాజరయ్యారు.

3463
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles